ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పునర్నిర్మించాలి' - జమ్మలమడుగులో తెదేపా ధర్నా

ఉక్కు కర్మాగారం కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన పైలాన్​ను తొలగించడం దుర్మార్గమని కడపజిల్లా తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో వాటిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

tdp  leaders protest at kadapa
జమ్మలమడుగులో తెదేపా ధర్నా

By

Published : Jan 3, 2021, 3:30 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళం తొలగించడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2018 డిసెంబర్ 27వ తేదీన గత ప్రభుత్వం ఉక్కు కర్మాగారం కోసం ఏర్పాటుచేసిన పైలాన్​ను ఈ ప్రభుత్వం తొలగించడం దుర్మార్గపు చర్య అని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు లింగా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉంచిన ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పరిశీలించారు. నాలుగు రోజుల్లో సున్నపురాళ్లపల్లె వద్ద వాటిని పునర్నిర్మించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details