ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ తెదేపా నాయకులు ఆందోళన చేశారు. విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని పాత జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నినాదాలు చేశారు. విద్యార్థుల బస్ పాసులు రుసుము పెంచడం అన్యాయమని నాయకులు అన్నారు. .పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి తెదేపా నాయకులు హాజరయ్యారు.
ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలి.. - ఆర్టీసీ బస్ ఛార్జీల తాజా వార్తలు
విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు .
ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు