ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders Open Challenge To Jagan: 'చీకటి జీవోలతో ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించే ప్రయత్నం.. ఋషికొండ నిర్మాణాలపై సీఎం వైఖరి వెల్లడించాలి' - గంటా శ్రీనివాసరావు ప్రెస్ట్ మీట్

TDP leaders Open Challenge To Jagan Govt: సోమవారం విశాఖలో పర్యటించే సీఎం జగన్ రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ సందర్శించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఋషికొండ వద్ద నిర్మాణాల విషయంలో వెచ్చించిన ఖర్చుల మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అనేక సమస్యల మీద సీఎంకు వినతి పత్రం ఇస్తామని.. అందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్​ను కోరారు.

TDP leaders Open Challenge To Jagan Govt
TDP leaders Open Challenge To Jagan Govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 5:52 PM IST

TDP leaders Open Challenge To Jagan Govt: చీకటి జీవోలతో ఉత్తరాంధ్ర ప్రజలను ప్రభుత్వం మోసగిస్తోందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. నాలుగేళ్లలో విశాఖకు జగన్ చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు తమను అనుమతించాలని కోరారు. సోమవారం విశాఖ వస్తున్న సీఎం.. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై జగన్ తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు.

TDP leaders Open Challenge To Jagan Govt: ఋషికొండ నిర్మాణాల ఖర్చులుపై సోషల్ మీడియాలో...

సోమవారం విశాఖలో పర్యటించే సీఎం జగన్ మోహన్ రెడ్డి రుషి కొండ లో సీఎం క్యాంప్ ఆఫీస్ సందర్శించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఋషికొండ వద్ద నిర్మాణాల విషయంలో వెచ్చించిన ఖర్చులు మీద సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రిక సమావేశంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ నేతలు మాట్లాడారు. ఒకచీకటి జీవో తెచ్చి సీఎం కార్యాలయం తరలించే ప్రయత్నం చేశారని... ఎప్పుడూ, రాజమార్గంలో ఏదీ జరప లేదని అన్నారు. విశాఖ వచ్చినప్పుడు రుషికొండపై నిర్మించిన సీఎం క్యాంప్ ఆఫీస్ సందర్శించాలని డిమాండ్ చేశారు.

Chandrababu Family Members Worried About His Health: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అందరిలో ఆందోళన.. ప్రభుత్వంపై ఆగ్రహం


ఉత్తరాంధ్రకు ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని ఆరోపించారు. పోలవరం ఎడమ కాలువ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చెయ్యలేదని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఏది చెయ్యలేదని, కేంద్రం దగ్గర కు వెళ్లి మెడలు వంచుతున్నారని ఎద్దేవా చేశారు.
రైల్వే జోన్ కోసం పెద్దగా మాట్లాడిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడని వైసీపీ నేతలు ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటు మీద మాట్లాడటం సరికాదని గంటా అన్నారు. విశాఖ లూలూ గ్రూప్ వస్తే వెనక్కి పంపేసారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ పక్షానికి సమయం ఇవ్వాలి కోరారు. జిల్లాకో ఎయిర్ పోర్ట్ అంటారని... జిల్లాకో మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయని గంటా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర లో బొత్స ధర్మానలు. పెద్ద నాయకులు కూడా చంద్రబాబు ఆరోగ్యం కోసం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణమన్నారు.

Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ పర్యటిస్తే చెట్లే కాదు.. దేవుడైనా పక్కకు జరగాల్సిందే..!

బండారు సత్యనారాయణ మూర్తి:సీఎం విశాఖ రావడానికి దొడ్డి దారిలో ఒక జీవో ఇచ్చారని అన్నారు. ఈ నాలుగేళ్ళ ఏడు మాసాల్లో ఏం చేశారో చెప్పాలని అన్నారు. బ్యాక్ వర్డ్ ఏరియా కి ఇచ్చే నిధులు ఎందుకు తేలేకపొయారని ప్రశ్నించారు. కనీసం మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కి ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. విశాఖలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశావా అంటూ ఎద్దేవా చేశారు. రాయలసీమ లో నేషనల్ హైవే క్లియర్ చేశారు.. మరి ఉత్తరాంధ్ర లో రెండు హైవే లు ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. విశాఖ టీడీపీ పార్లిమేంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాసరావుమాట్లాడుతూ రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి అపోయింట్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘ ప్రతినిధులకు అపోయింట్మెంట్ కూడా ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Anam Venkataramana Reddy Allegations: 'లక్షషేర్ క్యాపిటల్​ కంపెనీకి.. రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులా..! అవన్నీ జగన్ బినామీ కంపెనీలే'

ABOUT THE AUTHOR

...view details