విశాఖ జిల్లా కశింకోటలో అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించే సమావేశానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి 3 వేల మంది సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
'మహానాడును విజయవంతం చేయాలి' - mahanadu taja news
మహానాడు కార్యక్రమానికి సంబంధించి విశాఖ జిల్లా కశింకోటలో తెదేపా నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్ధనాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు.
కశింకోటలో తెదేపా ముఖ్యనాయకుల సమావేశం