స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. విశాఖ మన్యం అరకు నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 86 ఎంపీటీసీ.. 6 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన తెదేపా అభ్యర్థులుకు పలు సూచనలు చేశారు. వైకాపా నాయకుల బెదిరింపులకు కార్యకర్తలు భయపడకుండా పార్టీ అభ్యర్థులంతా విజయానికి కృషి చేయాలని కోరారు.
'వైకాపాకి భయపడొద్దు.. ఎన్నికల్లో గెలుపే మన లక్ష్యం' - అరకులో తెదేపా నేతల సమావేశం తాజా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అరకు నియోజకవర్గంలోని తెదేపా నేతలు సమావేశమయ్యారు. కార్యకర్తలంతా పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పిలుపునిచ్చారు.
!['వైకాపాకి భయపడొద్దు.. ఎన్నికల్లో గెలుపే మన లక్ష్యం' tdp leaders meeting for local body lections at Araku constituency in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6357006-188-6357006-1583822295564.jpg)
tdp leaders meeting for local body lections at Araku constituency in visakha
అరకులో తెదేపా నేతల సమావేశం