మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి సంతాపంగా విశాఖలో ఆ పార్టీ నేతలు ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం ఎదురుగా,ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థులు ఈ శిల్పాన్ని రూపొందించారు.కోడెల ఆత్మహత్య,రాజకీయ హత్యేనని ఎమ్మెల్యే గణేష్ కుమార్ అన్నారు.ప్రభుత్వ హింసాత్మక ధోరణి వల్ల ఓ సీనియర్ నాయకుణ్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.స్పీకర్ గా కోడెల,కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.
కోడెల మృతికి సంతాపంగా విశాఖలో సైకత శిల్పం - visakha tdp leaders
కోడెల మృతికి సంతాపంగా విశాఖలోని బీచ్ రోడ్డులో ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో సైకత శిల్పాన్ని తెదేపా నాయకులు రూపొందించారు. కోడెల మరణం ప్రభుత్వ హత్యేనని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ఆరోపించారు.
కోడెల సైకత శిల్పం
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు