ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నాయకుల గృహ నిర్భంధం - విశాఖ జిల్లాలో తెదేపా నాయకుల గృహనిర్భందం

విశాఖ జిల్లాలో ఇసుక మాఫియాపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు ధర్నాకు పిలుపునిచ్చినందున పోలీసులు తెదేపా నేతలను ముందస్తుగా గృహ నిర్భంధంలోకి తీసుకున్నారు. నేతలెవరూ ధర్నాకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.

తెదేపా నాయకుల గృహనిర్భందం
తెదేపా నాయకుల గృహనిర్భందం

By

Published : Nov 17, 2020, 3:48 PM IST

విశాఖ గ్రామీణ జిల్లాలో తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడిక్కడే గృహ నిర్భంధం చేశారు. జిల్లాలో ఇసుక మాఫియాపై అంశంపై అనకాపల్లిలో గనుల శాఖ కార్యాలయం వద్ద ఈ రోజు ధర్నాకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పిలుపు ఇచ్చారు.

ధర్నాలో తెదేపా నేతలు పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, గోవాడ చక్కెర కర్మాగారం పాలకవర్గ మాజీ ఛైర్మన్ గూనూరు మల్లునాయుడును గృహ నిర్భంధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details