ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది' - విశాఖ జిల్లా తెదేపా నేతలు వార్తలు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకాలు పెరిగిపోయాయని విశాఖ జిల్లా మాడుగుల తెదేపా నేతలు ఆరోపించారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోనల చేశారు.

tdp leaders give request latter
రెవేన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన తెదేపా నేతలు

By

Published : Jun 16, 2020, 11:06 AM IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ గవిరెడ్డి రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా చీడికాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీ, మహిళలపై వైకాపా దాడులు చేస్తుందని, ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇవీ చూడండి...

విశాఖలో ఓ కంపెనీలో పేలుడు... ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details