ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీకి ప్రయత్నించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లాలోని తెదేపా కార్యాలయంలో.. పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలంతా ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆసుపత్రుల్లో వెంటనే ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నా.. ప్రజలు పట్టించుకోని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.