స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు సూచించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో మాట్లాడిన ఆయన... 2013 స్థానిక సంస్థల ఎన్నికలు అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అధికంగా గెలుపొంది 2 జడ్పిటీసీ, 2 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇది పునరావృతం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తొమ్మిది నెలల జగన్మోహన్రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశానికే ప్రజలు ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.
అనకాపల్లిలో తెదేపా విస్తృత స్థాయి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు.. విజయ ఢంకా మోగించాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో విశాఖ జిల్లా అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు.
అనకాపల్లిలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం