ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తల ఆందోళన

విశాఖ జిల్లాలో పోలీసుల తీరును నిరసిస్తూ.. స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేని పోలీసులు.. వైకాపా నేత ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ వాళ్లను విడిచే వరకు స్టేషన్​ వదిలి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.

concern of tdp leaders in front of padmanabham police station
పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తల ఆందోళన

By

Published : Mar 30, 2021, 6:53 AM IST

విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పద్మనాభం మండలంలో ఓ దేవాలయంలో దర్శనానికి వెళ్లిన తెదేపా మండల అధ్యక్షుడిని ఓ వైకాపా కార్యకర్త కించపరచడంతో వివాదం చెలరేగింది. గత రాత్రి తెదేపా నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం వైకాపా కార్యకర్త ఫిర్యాదు చేయగా.. 30 మంది తెదేపా నేతలను పోలీస్ స్టేషన్​కు పిలిపించారు.

తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. వైకాపా నేత ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించడం ఎంతవరకు సమంజసం అంటూ తెదేపా నేతలు.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వాళ్లను విడిచే వరకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. పోలీస్ స్టేషన్​కు రప్పించిన వారిలో విద్యార్థలున్నారని.. వారి భవిష్యత్ ఏమవ్వాలని మహిళలు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు ఆర్.కృష్ణయ్య మద్దతు

ABOUT THE AUTHOR

...view details