ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డా.సుధాకర్ మృతి ప్రభుత్వ హత్యే : చంద్రబాబు - అనస్తీషియా వైద్యుడు సుధాకర్​ మృతి

డా.సుధాకర్​ను శారీరకంగా, మానసికంగా వేధించి హతమార్చారని తెదేపా నేతలు చంద్రబాబు, నారా లోకేశ్ ఆరోపించారు. ఇది ప్రభుత్వ హత్యేనన్న చంద్రబాబు... వైద్యుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

tdp leaders chandrababu, nara lokesh
తెదేపా నేతలు చంద్రబాబు, నారా లోకేశ్

By

Published : May 21, 2021, 11:51 PM IST

అనస్తీషియా వైద్యుడు సుధాకర్​ది ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్​ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సుధాకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు... డా.సుధాకర్​ను శారీరకంగా, మానసికంగా వేధించి బలిగొన్నారని ఆక్షేపించారు. వైద్యుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డా.సుధాకర్​ను వేధించి హతమార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైద్యుడు సుధాకర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details