మహానాడును ఉద్దేశించి వైకాపా నాయకులు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని.. తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇష్టానుసారంగా అవహేళన చేస్తూ మాట్లాడితే.. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటాడి బుద్ధి చెబుతారని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ వీడియో విడుదల చేశారు.
ఇష్టానుసారంగా మాట్లాడితే.. తెదేపా శ్రేణులు ఊరుకోరు: అయ్యన్న - మహానాడుపై వైకాపా నేతల కామెంట్స్
Ayyanna Patrudu On YCP: ఒంగోలులో నిర్వహించిన మహానాడుతో వైకాపా నేతల్లో వణుకుపుడుతోందని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మహానాడుని చూసి ఓర్వలేక వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
Ayyana On YCP
అన్నివిధాలా ఆటంకం కలిగించినా.. మహానాడు విజయవంతం కావడాన్ని చూసి వైకాపా నేతలు ఓర్వలేక పోతున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విజయ సాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంలు నోటిని అదుపులో పెట్టుకోకపోతే.. తెదేపా కార్యకర్తలు దహనం చేస్తారని హెచ్చరించారు. మహానాడుపై ఆరోపణలు చేస్తున్న వైకాపాకి కాలం చెల్లిందన్నారు. వైకాపా నాయకులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి యాత్రకు అర్థం తెలుసా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: