ఎన్నికల కమిషన్ ఆదేశాలను రాజకీయ పార్టీలు, నాయకులు, ఉద్యోగులు.. పాటించాలని తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. కరోనా తగ్గిందని.. పాఠశాలలు పూర్తిగా తెరిచేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహిణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి భయపడకుండా స్వేచ్ఛగా పని చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతో వైకాపా ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసేందుకు చూస్తుందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించినా.. తెదేపా, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎందుకు భయపడుతున్నారు?: వంగలపూడి అనిత - vangalapudi anitha fires on ycp about elections issue
ఎన్నికల నిర్వహిణకు వైకాపా ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని.. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. కరోనా తగ్గిందని పాఠశాలలు తెరిచేందుకు సిద్దమైన ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహిస్తామంటే కరోనా ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎందుకు భయపడుతున్నారు: వంగలపూడి అనిత