వైకాపా ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్షం పరీక్షల రద్దు కోరిందని... కక్షసాధింపు చర్యల్లో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలకు బయటకొచ్చే దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేపట్టిందని నిలదీశారు. పరీక్షల నిర్వహణ ద్వారా కోటి మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదని ప్రభుత్వం హామీ ఇస్తుందా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు: వంగలపూడి అనిత - ఏపీలో పరీక్షల నిర్వహణపై వంగల పూడి అనిత వ్యాఖ్య
కరోనా విజృంభిస్తున్నందన పరీక్షలు వాయిదా వేయాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తారని.. దీంతో మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆమె అన్నారు.
tdp leader vangalapudi anitha
ఇదీ చదవండి: