జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేసిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. సీఎం జగన్ చేతిలో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు.
ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వంగలపూడి అనిత - parishath elections in andhrapradhesh
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా విడుదల చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ నేత వంగలపూడి అనిత అన్నారు. ఎన్నికల రీ-నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చేతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని కీలుబొమ్మలా మారారని అనిత ఆరోపించారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత
పరిషత్ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకముంటే రీ-నోటిఫికేషన్ విడుదల చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. నామినేషన్లు సక్రమంగా వున్నప్పటికీ తెదేపా అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు తిరష్కరించారని ఆమె విమర్శించారు. తగిన సమయంలో వైకాపాకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.
ఇదీచదవండి.