విశాఖలో నిబంధనలు పాటిస్తూ నిర్శించిన తన భవనాన్ని కూల్చివేశారని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇలా తమను ఇబ్బంది పెట్టి విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల మంచి జరగదని విమర్శించారు. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా ఇలాంటి చర్యలేంటి అని పల్లా ప్రశ్నించారు. ఆక్సిజన్, వైద్యచికిత్స కోసం కొవిడ్ రోగులు అల్లాడుతున్నారని తెలిపారు.
రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా ఇలాంటి చర్యలేంటి? - విశాఖ జిల్లా తాజా వార్తలు
విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు విశాఖకు సరిపడరని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. నా భవనం కూల్చివేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు.

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు