విశాఖ జిల్లా గాజువాకలో జీవీఎంసీ అధికారులు.. తన భవనాన్ని కూల్చివేయడంపై, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నా భవనాన్ని విజయసాయిరెడ్డి సేవకులు కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులను విజయసాయి సేవకులుగానే చూస్తా. వాళ్లు జీవీఎంసీ అధికారులైతే నాకు ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి కర్ఫ్యూ సమయంలో వచ్చారు. బలవంతంగా నా ప్రాంగణంలోకి చొరబడి నిర్మాణాన్ని కూల్చారు. పార్టీ మారాలని నాకు ఆహ్వానం పంపారు. నాకు కొన్ని పద్ధతులు ఉన్నందునే హుందాగా వ్యవహరించా. పార్టీ అంటే అవసరాల కోసం మార్చేది కాదు. -పల్లా శ్రీనివాసరావు