ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకే విజయసాయిరెడ్డి పాదయాత్ర' - ఎంపీ విజయ్ సాయి రెడ్డి పాదయాత్రపై తెదేపా నేతల విమర్శలు

ఎన్నికల సందర్భంగా విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకే ఎంపీ విజయ​సాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి నొడగల కృష్ణ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు.. ప్రధానికి వినతి పత్రం సమర్పించి ఒత్తిడి తేవాలని కృష్ణా పేర్కొన్నారు.

comments on mp vijayasaireddy padayatra
విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకే విజయసాయిరెడ్డి పాదయాత్ర

By

Published : Feb 20, 2021, 7:40 PM IST

విశాఖ ఉక్కు కోసం ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న పాదయాత్రపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి నొడగల కృష్ణ విమర్శలు చేశారు. ఈ పాదయాత్రలో నిజాయతీ లేదని.. ఎన్నికల సందర్భంగా విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకు పాదయాత్ర చేస్తున్నారని కృష్ణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన విలువైన భూములను కబ్జా చేసేందుకు విజయసాయిరెడ్డి, తదితరులు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఆనాటి త్యాగాల స్ఫూర్తితో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు.. ప్రధానికి వినతి పత్రం సమర్పించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడతాం'

ABOUT THE AUTHOR

...view details