ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించకుండా... ప్రజలను మోసం చేస్తోంది'

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. వైకాపా సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం దారుణమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని చేతులు దులుపుకోకుండా వైకాపా ఎంపీలు పార్లమెంట్​లో పోరాటం చేయాలని హితవు పలికారు.

kollu ravindra
కొల్లు రవీంద్ర

By

Published : Jul 10, 2021, 11:42 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం దారుణమన్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న పరిశ్రమలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తోందని కొల్లు రవీంద్ర విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని చేతులు దులుపుకోకుండా వైకాపా ఎంపీలు పార్లమెంట్​లో పోరాటం చేయాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న కొల్లు రవీంద్ర.. స్టీల్ ప్లాంట్​ను కాపాడుకునేందుకు తెదేపా పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details