ఆర్థిక రాజధాని ముద్దు.. రాజకీయ రాజధాని వద్దు అని విశాఖ వాసులు అంటున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డి భూముల విలువ పెంచుకోవడం కోసమే విశాఖపై వాలుతున్నారని మండిపడ్డారు.
'భూ కబ్జాల కోసమే విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటన' - తెదేపా నేత బండారు సత్యనారాయణ వార్తలు
భూ కబ్జాల కోసమే విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని వైకాపా ప్రభుత్వం అంటోందని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. విజయసాయి రెడ్డి విశాఖలో తిష్ట వేశాక భారీగా భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు.
bandaru satya narayana
విజయసాయిరెడ్డి విశాఖలో తిష్టవేశాక... వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. జగన్ కూడా మకాం వేస్తే భూకబ్జాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని విమర్శించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానంటోంది భూ కబ్జాల కోసమేనని.. ఉత్తరాంధ్ర ప్రజలపై ప్రేమతో కాదని ఓ ప్రకనటలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి