జగన్ తాననుకున్నది చేస్తున్నారు తప్ప, ప్రజల గురించి ఆలోచించడం లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. కేబినెట్ సమావేశంలో ప్రజల సమస్యలపై, కరోనా ఉద్ధృతిపై చర్చించకపోవడం దారుణమన్నారు. కరోనా వల్ల సీబీఐ కోర్టు విచారణ నిలిచిపోయిందని, వాయిదాలకు వెళ్లే పనిలేదని జగన్ ఆనందపడుతున్నారన్నారు. రోజుకు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్ కుట్ర రాజకీయాలు, కక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
'అయోధ్యరామిరెడ్డి సెజ్, ఎస్పీవై ఆగ్రోస్ ప్రమాదాలపై చర్యలేవీ?' - టీడీపీ తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వం ప్రజాసమస్యలు పక్కన పెట్టి, కక్షలు, కార్పణ్యాలు సాధించేందుకు ప్రాధాన్యత ఇస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. మంత్రి మండలి సమావేశంలో కరోనా ఉద్ధృతిపై చర్చించకపోవడం దారుణమన్నారు. అయోధ్యరామిరెడ్డి సెజ్ లో, ఎస్పీవై ఆగ్రోస్ లో జరిగిన ప్రమాదాలపై చర్యలు తీసుకోకుండా..కావాలని ఓ వర్గాన్ని లక్ష్యం చేసుకుని రమేష్ ఆసుపత్రి ఎండీని వేధిస్తున్నారని ఆరోపించారు.
అచ్చెన్నాయుడు అవినీతి చేసినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న అనిశా జేడీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల ప్రాణాలు హరించేలా నాసిరకం మద్యం అమ్ముతూ, ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని మండిపడ్డారు. రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ బాబుని వేధిస్తున్న జగన్, అయోధ్యరామిరెడ్డి సెజ్ లో,ఎస్పీవై ఆగ్రోస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించలేదే అని ప్రశ్నించారు. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా, తప్పించుకున్నంత మాత్రాన జగన్ పై ఉన్న కేసులు ఎక్కడికీ పోవని బండారు సత్యనారాయణమూర్తి స్పష్టంచేశారు.
ఇదీ చదవండి :అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా విజయవాడ