ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కరోనా లెక్కలు దాస్తుంది.. అందుకే..! - రాజధాని మార్పుపై టీడీపీ కామెంట్స్

రాజధానిని విశాఖకు తరలించేందుకు వైకాపా ప్రభుత్వం కరోనా కేసుల వివరాలు తప్పుగా వెల్లడిస్తోందని తెదేపా నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ జిల్లాలో కరోనా అనుమానిత కేసులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విరాళాల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులను ఇబ్బందిపెడుతున్నారని సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.

bandaru satyanarayana murthy
బండారు సత్యనారాయణ మూర్తి

By

Published : Apr 18, 2020, 8:00 PM IST

కరోనా కేసులు దాచి రాజధాని తరలింపు కుట్ర జరుగుతుందంటున్న తెదేపా నేత సత్యనారాయణ మూర్తి

విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు దాచిపెట్టి రాజధానిని విశాఖకు తరలించే కుట్ర జరుగుతోందని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. కరోనా లక్షణాలున్న వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారన్నారు. ఈ విషయంపై కేంద్రం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖలో విరాళాల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ క్వారంటైన్​కు పంపకుండా హోం ఐసోలేషన్​కు పంపడం చూస్తే విశాఖలో సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.

జగన్... కడపకే ముఖ్యమంత్రా?

కరోనా బాధితుల పేర్లు వెల్లడించకూడదనే నిబంధనలతో.. అనుమానిత కేసులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కడప అరటి రాష్ట్రం మొత్తం రవాణా చేస్తున్నారన్న ఆయన.. గోదావరి జిల్లాల్లో అరటి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. జగన్ కడప జిల్లాకే ముఖ్యమంత్రా అని నిలదీశారు.

ఇదీ చదవండి :'కరోనా వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులూ సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details