ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ కుటుంబం 1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడింది..బండారు సత్యనారాయణమూర్తి - Bandaru Satyanarayanamurthy

Visakha lands: విశాఖ రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనక భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలుగుదేశంపార్టీ నాయకులు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. దీని వెనుక జగన్ హస్తముందని ఆయన ఆరోపించారు.

Bandaru sathya narayana
Bandaru sathya narayana

By

Published : Nov 7, 2022, 8:38 AM IST

తెలుగుదేశంపార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి

Visakha lands: విశాఖలో రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనక భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలుగుదేశం ఆరోపించింది. ఈ వ్యవహారంలో జగన్ కుటుంబ సభ్యులు 1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడినట్లు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జగన్ పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి, సీఎం సతీమణి భారతి ప్రోద్బలంతోనే అక్రమాలు జరిగినట్లు ఆయన విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులతోపాటు ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలువైన రేడియంట్ భూములు లాగేసుకున్నారని బండారు ఆరోపించారు. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం రేడియంట్ సంస్థకు చెందిన రమేశ్ కుమార్ కు భూములు అప్పగించాల్సి ఉండగా..ఆయనతో వేమిరెడ్డి MOU కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో వెయ్యికోట్ల వరకు గోల్ మాల్ జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details