ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MINING: 'అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' - visakha news

విశాఖ జిల్లాలో.. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. లేటరైట్ తవ్వకాలతో పాటు ఇదే ప్రాంతంలో గ్రావెల్, కంకర, ఇసుక ఇతర రాతి క్వారీల నుంచి అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

mining in visakha district
mining in visakha district

By

Published : Aug 29, 2021, 10:23 AM IST

విశాఖ జిల్లాలోని నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో లేటరైట్ తవ్వకాలతో పాటు ఇదే ప్రాంతంలో గ్రావెల్, కంకర, ఇసుక ఇతర రాతి క్వారీల నుంచి అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

నర్సీపట్నం మండలం వేములపూడి ప్రాంతంలో అక్రమంగా మట్టి సేకరిస్తున్న వారిని ప్రతిఘటిస్తూ వాహనాలతో ఢీకొట్టిన చంపేందుకు ప్రయత్నించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అందుకు తగ్గట్టుగా ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు ఈ విషయంలో రెవెన్యూ పోలీస్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details