అశోక్‌గజపతిరాజు కుటుంబం, వంశం గురించి తెలుసుకుని మాట్లాడాలని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. దేవదాయ శాఖ మంత్రి మాట్లాడే తీరు అప్రజాస్వామికంగా ఉందని దుయ్యబట్టారు. విగ్రహాల ధ్వంసానికి బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని అయన డిమాండ్ చేశారు.
ఆలయాలపై దాడులకు సీఎం, డీజీపీనే కారణం: అయ్యన్నపాత్రుడు - ఏపీలో ఆలయాలపై దాడులు వార్తలు
రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు సీఎం, డీజీపీనే కారణమని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అశోక్‌గజపతిరాజును విమర్శించే హక్కు వైకాపాకు లేదని అయ్యన్న స్పష్టం చేశారు.
tdp leader ayyannapatrudu comments on ysrcp govt
విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో హింసను ప్రేరేపిస్తున్నారు. పేకాట క్లబ్ నడిపేవాళ్లు మంత్రిగా ఉన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నా. -అయ్యన్నపాత్రుడు, తెదేపా నేత
ఇదీ చదవండి:అనంతపురం పోలీసులకు షాక్ ఇచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య