రాష్ట్రంలో వైకాపా రాక్షసపాలనకు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైకాపా పాలనలో సామాన్యులకు, దేవాలయాలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పాలన ప్రపంచంలో మరెక్కడా ఉండదని ఎద్దేవా చేశారు. అందుకే ఈ విధానాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి: అయ్యన్న - panchyati election news
పంచాయతీ ఎన్నికల ద్వారా అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని తెదేపా నేత చింతకాయల అయ్యనపాత్రుడు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో అయ్యన్న పర్యటించారు.
![స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి: అయ్యన్న Tdp leader ayyannapatrudu comments on ycp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10437936-973-10437936-1612009062284.jpg)
తెదేపా నేత చింతకాయల అయ్యనపాత్రుడు
గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ అయ్యన్నపాత్రుడు పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: