ముఖ్యమంత్రి జగన్ ఆధీనంలో ఉన్న గనులు కేటాయిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం 6 నెలల్లోనే లాభాల్లోకి వస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియని వారు కూడా రాజ్యాంగ పదవుల్లో ఉండటం దారుణమని వ్యాఖ్యానించారు. గనులన్నీ కాజేసి, ఇప్పుడేమో విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగం వీడియోను అయ్యన్నపాత్రుడు తన ట్విట్టర్‌కు జత చేశారు.
'సీఎం అధీనంలోని గనులు ఇస్తే 6 నెలల్లోనే లాభాల్లోకి వస్తుంది' - విశాఖ స్టీల్ ప్లాంటపై తెదేపా నేతల వ్యాఖ్యలు
సీఎం జగన్ అధీనంలోని గనులు ఇస్తే 6 నెలల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని తెదేపా నేత అయ్యనపాత్రుడు అన్నారు. గనులన్నీ కాజేసి ఇప్పుడు గనులు కేటాయించాలనడం దారుణమని ఆరోపించారు.
tdp leader ayyannapathrudu