మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు
'వాలంటీర్లతోనే వాటిని పంచుతారేమో...?': అయ్యన్నపాత్రుడు - తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు వార్తలు
మద్యం, డబ్బు పంపిణీ చేయొద్దంటూ పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలు, పోలీసులు... వాలంటీర్ల ద్వారానే వాటిని పంపిణీ చేస్తారేమో అనే అనుమానం కలుగుతోందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. సీఎం జగన్‌కు కనువిప్పు కలిగించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా గెలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డీజీపీ సవాంగ్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించిన అయ్యన్న.... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో శాంతిభద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు.
!['వాలంటీర్లతోనే వాటిని పంచుతారేమో...?': అయ్యన్నపాత్రుడు tdp leader ayyanna patrudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6347696-thumbnail-3x2-ayya.jpg)
tdp leader ayyanna patrudu