గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా తప్ప మరొక జెండాను అనుమతించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని భయపు రెడ్డి పాలెం వద్ద... తెదేపా సంస్థాగత ఎన్నికల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. అంతకు మందు పార్టీ జెండాను ఆవిష్కరించి... ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. సీఎం జగన్ పాలన తుగ్లక్ పాలనతో సమానమని అయ్యన్న విమర్శించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా నర్సీపట్నం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని.. ఇవి తిరిగి ప్రారంభమయ్యేలా సర్కారు చర్యలు తీసుకోవాలని అన్నారు.
'ప్రాణం ఉన్నంత వరకూ తెదేపాతోనే నా ప్రయాణం'
చివరి శ్వాస ఆగేంతవరకూ తెదేపాను వీడేదే లేదని... మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో... తెదేపా సంస్థగత ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ విధానాలు తుగ్లక్ పాలనతో సమానమని విమర్శించారు.
'గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ తెదేపాతోనే నా ప్రయాణం'