విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి జగన్రెడ్డి, సాయి రెడ్డి వెళ్తే అసలు వాస్తవాలు బయటపడతాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరలకు విద్యుత్ కొని 6 వేల కోట్లు ఆదా చేస్తే..., కేంద్ర మంత్రి ఎందుకు తప్పు పట్టారని నిలదీశారు. 2 రూపాయల 70 పైసలకే కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ అందిస్తుంటే ఏపీలో అధిక ధరలకు కొనడమే కాకుండా ప్రజల నుంచి యూనిట్కి 9రూపాయలు వసూలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకటించటాన్ని అయ్యన్న గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు,అధిక బిల్లుల వసూళ్లతో 13 నెలల్లో సుమారుగా 30 వేల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పీపీఏల్లో వేలు పెట్టి చివాట్లు తిన్నందుకు 8 రాష్ట్రాలు జగన్ని ఆదర్శంగా తీసుకున్నాయా అని ఎద్దేవా చేశారు. ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు ఆదర్శంగా తీసుకున్నారా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గత ప్రభుత్వం పై ఏడుపుగొట్టు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
'బిల్లుల వసూళ్లకు మీరు వస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి' - ayyanna latest tweet
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 8 రాష్ట్రాలు జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఆదర్శంగా తీసుకున్నాయో చెప్పాలంటూ ట్వీట్ చేశారు.
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు