Ayyanna Fire On YSRCP govt Over Pensions: పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని తెదేపా సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.
ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క లబ్ధిదారుడికి 32 నెలల బకాయి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.24 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు, వికలాంగులు, పేదవారిని మోసం చేస్తే ఎన్నికల తుఫానులో కొట్టుకుపోతారన్నారు. వైకాపా పాలనకు ఇదే ఉరి తాడుగా మారనుందని హెచ్చరించారు.