ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ATCHANNAIDU: 'ఆరునూరైనా.. చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి' - TELUGU NEWS

ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని తేల్చి చెప్పారు.

tdp-leader-atchannaidu-comments-on-next-cm-of-ap
'ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి'

By

Published : Dec 27, 2021, 2:44 PM IST

'ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి'

ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సమర్థ నాయకుడు వస్తేగానీ.. రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామన్న వైకాపా ప్రభుత్వం.. ఇప్పటి వరకూ చేయలేదని మండిపడ్డారు.

పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని చెప్పడం.. చోద్యంగా ఉందన్నారు. కార్మిక సంక్షేమం జరగాలి అంటే మళ్లీ తెదేపా రావాల్సిందేనని అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు వల్లనే అవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details