రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పాడేరులోని తన స్వగృహంలో తోటి నాయకులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ నియంత్రణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విశాఖలో 50కి పైనే పాజిటివ్ కేసులున్నా.. తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు కేసుల తీవ్రతను తక్కువగా చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.
'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'
TAGGED:
tdp leaders protests news