రాజధాని అమరావతి కోసం రైతులg చేపడుతున్న నిరసనకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో తేదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు ఇచ్చారని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
'అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు' - అమరావతి రైతులకు మద్దతుగా అనకాపల్లిలో తెదేపా నేతల నిరసన
అమరావతి రైతుల నిరసనలకు.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు.
అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు:బుద్ధ నాగ జగదీశ్వరరావు