విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మాకవరపాలెం పంచాయతీ ఎన్నికల్లో తెదేపా తరఫున గెలుపొందిన లక్ష్మణమూర్తి ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం గ్రామంలోని తెదేపా జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాకవరపాలెంలో ఉద్రిక్తత... తెదేపా జెండా దిమ్మె ధ్వంసం - makavarapalem latest news
విశాఖ జిల్లా మాకవరపాలెంలో తెదేపా జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామంలోని ఆ పార్టీ నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాకవరపాలెంలో తెదేపా జెండా దిమ్మె ధ్వంసం