ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతినే రాజధానిగా కొనసాగించండి: రామానాయుడు

By

Published : Aug 6, 2020, 9:03 PM IST

విభజించిన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంటుందని.. మూడు ముక్కలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రపై వైకాపాకు అంత ప్రేముంటే విశాఖను పూర్తిస్థాయి రాజధాని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు రామానాయుడు
తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు రామానాయుడు



అన్ని జిల్లాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా కొనసాగించాలని, మూడు ముక్కలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజుపురంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలను మోసం చేయడానికి సీఎంతో సహా మంత్రులు అధికారంలో లేనప్పుడు ఒకమాట.. ఉన్నప్పుడు ఒకమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ మాట తప్పారని... మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా.. రాజధానిపై 30 వేల ఎకరాల భూమి సేకరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప ఉపయోగం ఏమీ ఉండదన్నారు. కొవిడ్ నివారణలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మూడు ముక్కలాట మొదలుపెట్టారని ఆరోపించారు. వైకాపాకు ఉత్తరాంధ్రపై అంత ప్రేముంటే విశాఖను ఏకైక రాజధాని చేస్తే స్వాగతిస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు అనువైన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు రామానాయుడు
ఇవీ చదవండి

విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టకర్

ABOUT THE AUTHOR

...view details