విశాఖ సబ్బవరంలో రెండు మద్యం బాటిళ్లతో వెళ్తున్న తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ.. పోలీస్‌స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆందోళనకు దిగారు. మద్యం బాటిళ్లు కొనుక్కొని వెళ్తుండగా.. గంగయ్య, అప్పారావు అనే వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం తెలిసిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సబ్బవరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. మూడు బాటిల్స్ వరకు ఉండవచ్చని.. అలాంటిది రెండు బాటిళ్లు మాత్రమే ఉంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్టేషన్‌లో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఎస్సైకి ఫోన్ చేయగా.. రాత్రి11 గంటల తర్వాత వస్తానని చెప్పారు. తిరిగి 11 గంటలకు ఫోన్ చేయగా..సోమవారం ఉదయం వస్తానని బదులిచ్చారు. ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే బాబ్జీ.. ఠాణా ముందు ఆందోళనకు దిగారు.
సబ్బవరం పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆందోళన - విశాఖ మున్సిపల్ ఎన్నికల తాజా వార్తలు
విశాఖ సబ్బవరం పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా మాజీ ఎమ్మెల్యే గండి బాజ్జీ నిరసన చేపటారు. తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆందోళనకు దిగారు. ఓ మద్యం దుకాణంలో రెండు మద్యం బాటిళ్లు కొనుక్కొని వెళ్తుండగా.. గంగయ్య, అప్పారావు అనే వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
tdp ex mla gandi babji protest at sabhavaram