విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తెదేపా అభ్యర్థులు నగరంలోని పలు వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నగరంలోని 21వ వార్డు తెదేపా అభ్యర్థి అవినీష్ ప్రచారంలో భాగంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును ఆయన నివాసంలో కలిశారు. తొమ్మిదో వార్డు అభ్యర్థి బుడిమూరి అఖిల.. రెవెన్యూ క్వార్టర్స్, విశాలాక్షి నగర్, కొండవాలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. 16వ వార్డు అభ్యర్థి పీలా ఉమారాణి.. ఇసుకతోట, రెల్లివీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
విశాఖలో తెదేపా అభ్యర్థుల ఇంటింటి ప్రచారం - visakha latest news
విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తెదేపా ఆభ్యర్థులు విసృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు.
విశాఖలో తెదేపా ఇంటింటి ప్రచారం