విశాఖ జిల్లా భీమిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజేతలైన తెదేపా అభ్యర్థులు.. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 2, 3, 5, 7 వార్డుల్లో ప్రతిపక్ష అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా.. మధురవాడ, భీమిలి, తగరపువలసల్లో.. అభిమానులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడో వార్డు తెదేపా అభ్యర్థిని పిళ్లా మంగమ్మ.. 7,375 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.
భీమిలిలో తెదేపా అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ - భీమిలిలో తెదేపా అభ్యర్థుల బైక్ ర్యాలీ
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన తెదేపా అభ్యర్థులు.. తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా మధురవాడ, భీమిలి, తగరపువలసల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.

భీమిలిలో తెదేపా అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ