ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ వేధింపులే డా.సుధాకర్ మృతికి కారణం' - nakka anand news

ప్రభుత్వ వేధింపులతోనే డాక్టర్‌ సుధాకర్‌ మృతి చెందారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సీఎం జగన్ ఖూనీ చేస్తున్నారని అన్నారు. సుధాకర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు.

nakka anandbabu
నక్కాఆనంద్‌బాబు

By

Published : May 22, 2021, 12:47 PM IST

Updated : May 22, 2021, 6:26 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై దమనకాండ పునరావృతం కాకుండా ఐక్యంగా ముందుకు సాగాలని తెదేపా సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడిగా ప్రభుత్వం ముద్రవేసి ఇబ్బందులకు గురిచేయటం వల్లే మానసిక క్షోభకు గురై మరణించారని ఆయన ఆరోపించారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఖూనీ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తున్నారని.. ఈ తీరును అంతా గమనించాలని కోరారు.

'కోటి పరిహారం... ఒకరికి ఉద్యోగం..'

సుధాకర్ మరణమే రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దమనకాండకు నిదర్శనమని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులతోనే మానసిక క్షోభకు గురై సుధాకర్ చనిపోయారన్నారు. సుధాకర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోకుంటే ఎస్సీల చేతిలో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

దళిత మేధావి, సుప్రసిద్ధ వైద్యుడు సుధాకర్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా నేత పుచ్ఛా విజయ కుమార్ అన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించినందుకే.. కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టారని అన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ: గుండెపోటుతో మత్తు వైద్యుడు సుధాకర్ మృతి

Last Updated : May 22, 2021, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details