ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని...పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజా సాయి బాబా ఆలయంలో ప్రమాణం చేయాలని తెదేపా నేత బండారు అప్పలనాయుడు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలపై, అసత్యాలపై దేవునిపై ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నిజంగా భూమి ఆక్రమించకపోతే..సవాల్ స్వీకరించి బాబా ఆలయానికి రావాలన్నారు.
'భూ ఆక్రమాలకు పాల్పడకపోతే..బాబా ఆలయంలో ప్రమాణం చేయండి' - అదీప్ రాజా భూ ఆక్రమణలు న్యూస్
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజా నిజంగా భూమి ఆక్రమించకపోతే బాబా ఆలయంలో ప్రమాణం చేయాలని తెదేపా నేత బండారు అప్పలనాయుడు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలపై, అసత్యాలపై దేవునిపై ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
భూ ఆక్రమాలకు పాల్పడకపోతే..బాబా ఆలయంలో ప్రమాణం చేయండి
సీఏ చదివిన విజయసాయిరెడ్డిని బీకాం చదివిన బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించే హక్కు లేనప్పుడు..పది పాసైన అదీప్ రాజా బీకాం చదివిన సత్యనారాయణ మూర్తిని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. అదీప్ రాజా భూ భాగోతాలను రెవెన్యూ అధికారులే బయటపెట్టాలన్నారు. ఇకనైనా విమర్శలు మాని.., నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.
ఇదీచదవండి :రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: చంద్రబాబు