రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం చేత కాకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాజమహేంద్రవరంలో మైనర్ పై అత్యాచారం చేసి నిందితులు పోలీసుస్టేషన్ ఎదుట వదిలేస్తే.. నిందితుడిని పట్టుకోలేకపోవవడం దారుణమన్నారు. ఈసీ విషయంలో బయటకు వచ్చిన సీఎం.. ఆడపిల్లలకు అన్యాయం జరిగినపుడు ఎందుకు స్పందించరని అనిత ప్రశ్నించారు.