విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టును వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు(tdp protest) నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జ్లు పాల్గొన్నారు. విశాఖలో వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టి ప్రభుత్వం.. విశాఖ భవిష్యత్ తరాలకు తీరని లోటు చేసిందని విశాఖ జిల్లా తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కలెక్టరేట్ నుంచి మొదలుపెట్టి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే పాలిటెక్నిక్ కాలేజ్ వరకు ఏది వదలకుండా తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ..పరిపాలన రాజధాని అని చెప్పి ఇక్కడ ఆస్తులను పూర్తిగా తాకట్టు పెట్టారని... ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉంటే ఇక పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు.
TDP PROTEST: ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై తెదేపా నిరసన - విశాఖలో తెదేపా నిరసన
విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టును వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు(tdp protest) నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జ్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై తెదేపా నిరసన