సీనియర్ వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని నిరసిస్తూ విశాఖలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీనియర్ దళిత డాక్టర్ సుధాకర్‌ని పోలీసులు అత్యుత్సాహంతో అర్ధనగ్నంగా ప్రదర్శించి, చేతులను తాళ్లతో కట్టి దాడి చేస్తూ ఆటోలో పోలీస్‌స్టేషన్‌కి తీసుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీలకు, బీసీలకు తెదేపా అండగా ఉంటుందని తెదేపా నాయకులు తెలిపారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నజీర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామానంద్ పాల్గొన్నారు.
'పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండిస్తున్నాం' - విశాఖలో తెదేపా ఆందోళన
నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. డాక్టర్‌పై దాడి చేసి తాళ్లతో కట్టటాన్ని ఆయన ఖండించారు.
విశాఖలో తెదేపా ఆందోళన