విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. 8 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారి నుంచి 11 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో గుట్టుగా పేకాడుతున్న ఏడుగురి వద్ద నుంచి లక్షా 87 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నందగిరినగర్ వద్ద పేకాడుతున్న మరో ఏడుగురి నుంచి రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ సంబంధిత పోలీస్స్టేషన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
జూదం ఆడేవారి ఆటకట్టించిన పోలీసులు - టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు తాజా వార్తలు
విశాఖలో పలుచోట్ల పేకాట, పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తున్న పలువురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ను ఆసరా చేసుకుని జూదం ఆడేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
గుట్టుగా జూదం ఆడేవారి ఆటకట్టించిన పోలీసులు