ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన్​నాయుడు అరెస్టు... రిమాండ్​కు తరలింపు - vizag district news today

విశాఖ జిల్లా పెందుర్తి దళిత యువకుడు శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడైన సినీ నటుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కేజీహెచ్​లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనకాపల్లి సబ్​జైలుకు తరలించారు.

tansure case main accused nuthan naidu arrest by vizag police
అనకాపల్లి సబ్​జైలు

By

Published : Sep 6, 2020, 3:22 PM IST

విశాఖపట్నం జిల్లా పెందుర్తి దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు... నూతన్‌ నాయుడును పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టయిన నూతన్‌ నాయుడుకు... అర్ధరాత్రి దాటాక కేజీహెచ్​లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచిన పోలీసులు... అనకాపల్లి సబ్​జైలుకు తరలించారు. ఫేక్‌ ఫోన్ కాల్స్‌ వ్యవహారంలోనూ నూతన్‌ నాయుడుపై గతంలో కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details