విశాఖలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు నిలిచిపోయి.. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి. మల్కాపురంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. చమురు రవాణా చేయవలసిన ఆయిల్ ట్యాంకర్లు రహదారిపై నిలిచిన వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో.. ఎటూ వెళ్లే దారి లేక ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు వాహనాల పైకెక్కి కూర్చున్నారు.
ఐవోసీ టెర్మినల్‌లోకి నీరు.. క్యాబిన్ ఎక్కిన ట్యాంకర్ డ్రైవర్లు - విశాఖ తాాజా వార్తలు
విశాఖ మల్కాపురం ఐవోసీ టెర్మినల్ వద్ద రహదారిపై వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిలోనే ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో.. ఏం చేయాలో తెలియక ట్యాంకర్ల డ్రైవర్లు క్యాబిన్లు ఎక్కి కూర్చున్నారు.
![ఐవోసీ టెర్మినల్‌లోకి నీరు.. క్యాబిన్ ఎక్కిన ట్యాంకర్ డ్రైవర్లు tanker drivers suffering with heavy rians in vishakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13689081-199-13689081-1637411279842.jpg)
tanker drivers suffering with heavy rians in vishakha