ఇటీవల విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నాతవరం మండలం తాండవ జలాశయం నీటిమట్టం మూడు అడుగుల మేర పెరిగింది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 374 అడుగులకు చేరింది. నీటిమట్టం ఆశాజనకంగా ఉండటం వల్ల ఖరీఫ్ కాలానికి సంబంధించి నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూలై నెలలో ఎండలు ముదిరితే... ఆగస్టు 5 లేదా 10 తారీఖుల్లో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన తాండవ జలాశయం నీటిమట్టం - visakha district latest news
విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు తాండవ జలాశయం నీరు అందిస్తోంది. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ జలాశయంలో మూడు అడుగుల నీటిమట్టం పెరిగింది. దీంతో రైతులకు సకాలంలో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
తాండవ నదిలో పెరిగిన నీటిమట్టం