అడుగంటిన తాండవ జలాశయం... ఆందోళనలో రైతాంగం - తాండవ జలాశయం
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆశాజనకంగా నీటిమట్టం లేక రైతుల్లో ఆందోళన మొదలైంది. ఖరీఫ్ పంటలు ఏ విధంగా పండించాలని ఆలోచనలో పడ్డారు.
విశాఖపట్నం జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కలిపి 51వే150 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ జలాశయం తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరుకు సాగునీరు సరఫరా అవుతుంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం కేవలం 346 అడుగుల స్థాయిలోనే ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలంటే కనీసం 360 అడుగుల వరకు నీటిమట్టం ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ను ఎలా నెట్టుకు రావాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.